NTV Telugu Site icon

మోడీ తన కల సాకారం చేసుకున్నారు : ఎమ్మెల్యే సీతక్క

ప్రధాని మోడీపై ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ట్విట్టర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోడీ జీ 7 సంవత్సరాల నుండి రోజుకు 18 గంటలు పని చేస్తూ తన బెస్ట్ ఫ్రెండ్ (గౌతమ్ అదానీ)ను ఆసియాలోనే అత్యంత ధనవంతునిగా మారే కలను సాకారం చేసుకున్నారంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అయితే గతంలో చైనాకు చెందిన ఓ పత్రిక ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం 5.30 గంటల నుంచి అర్థరాత్రి 1 గంట వరకు పనిచేస్తున్నారని.. ఆయన పెండింగ్‌లో ఏ ఫైల్‌ ఉంచడం లేదని కొనియాడుతూ కథనాలు ప్రచురించిన నేపథ్యంలో ఎమ్మెల్యే సీతక్క ఈ విధంగా స్పందించారు. అయితే ఇటీవలే గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతునిగా ఫోర్బ్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.