దీపావళి వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ఈరోజు జమ్మూకాశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్‌లో పర్యటించారు. అక్కడ జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. జవాన్లకు స్వీట్లు అందించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. తాను ఒక్కడినే ఇక్కడికి రాలేదని, 130 కోట్ల భారతీయుల ప్రతినిధిగా వచ్చినట్టు ప్రధాని మోడీ తెలిపారు. సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉందని, 2014 నుంచి దీపావళి వేడుకలను సైనికులతో జరుపుకుంటున్నానని అన్నారు.
Read: మిస్టరీ: ఆ బ్రిడ్జి మీదనుంచి దూకి ఆత్మహత్యలు చేసుకుంటున్న కుక్కలు… కారణం…
భారత జవాన్లు శతృవులకు ధీటైన జవాబు ఇస్తున్నారని, సైనికుల సాహసాలు దీపావళి వేడుకలకు మరింత వన్నె తీసుకొచ్చాయని తెలిపారు. బోర్డర్‌లో సైనికులు పహారా కాస్తుండటం వలనే దేశంలోని ప్రజలు సుఖంగా నిద్రపోతున్నారని అన్నారు. ఇక విదేశాల నుంచి ఆయుధాల కోనుగోలు తగ్గిందని, 200 రకాల ఆయుధాలు, పరికరాలు దేశంలోనే తయారవుతున్నాయని అన్నారు. వరల్డ్ క్లాస్ ఆయుధాలు భారత్ లోనే తయారవుతున్నాయని, త్వరలోనే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతామని ప్రధాని మోడి తెలియజేశారు.
