NTV Telugu Site icon

నాడు రికార్డు స్థాయి ఓట్లు.. నేడు ఏకగ్రీవం.. పోచంపల్లి రికార్డు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రికార్డు చెక్కు చెదరలేదు. 98 శాతం ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీ గా పోచంపల్లి అప్పట్లో చరిత్ర సృష్టించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కు 2019 జూన్ 3 న ఉప ఎన్నిక జరిగింది. మొత్తం ఓటర్లు 902 మంది ఉండగా 883 మంది ఓటు వేశారు. 848 ఓట్లు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి పడ్డాయి.

ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు పడటం దేశంలోనే లేదని… ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ కు కేవలం 23 రాగా 12 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఈ సారి ఒకేసారి 12 స్థానాలకు ఎన్నికలు వచ్చాయి. ఆరు ఏకగ్రీవం కాగా మరో ఆరింటికి ఇవాళ ఫలితాలు వెలువడ్డాయి. 89 శాతం ఓట్లతో ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో TRS అభ్యర్థి విఠల్ విజయం సాధించారు. దీంతో పోచంపల్లి దరిదాపుల్లోకి ఎవరూ రాలేదు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పోచంపల్లి వివాద రహితుడు. వరికోలు శ్రీమంతుడిగా పేరుంది. ఇప్పుడు మిగతా పార్టీలకు కొంత బలం ఉన్నా పోచంపల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ వేసిన వాళ్ళు కూడా ఉపసంహరించుకున్నారు. ఒకసారి రికార్డు స్థాయి ఓట్లతో ఇప్పుడు ఏకగ్రీవంతో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. దీంతో పార్టీలో పోచంపల్లి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.