Site icon NTV Telugu

హత్యా రాజకీయాలకు పేటెంట్ అంతా చంద్రబాబుదే : జోగి రమేష్‌

Jogi Ramesh

Jogi Ramesh

మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేత చంద్రయ్యపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్య చేశారు. అయితే చంద్రయ్య అంత్యక్రియల్లో టీడీపీ అధినేత పాల్గొని మాట్లాడుతూ.. వైసీపీ హత్యారాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. దీనిపై స్పందంచిన ఎమ్మెల్యే జోగిరమేశ్‌ హత్యా రాజకీయాలకు పేటెంట్ అంతా చంద్రబాబుదేనని అన్నారు. ఒంటరిగా మమ్మల్ని ఎదుర్కొనే సత్తా లేకే చంద్రబాబు పొత్తుల కోసం ఆరాటపడుతున్నారని, పొత్తుల ద్వారా ప్రజా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. ప్రజలకు అభివృద్ది సంక్షేమ ఫలాలు బ్రహ్మాండంగా అందుతున్నాయని, టీడీపీ, జనసేన, బీజేపీ ఏకమైనా ప్రజా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవని ఆయన వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి రాబోతోందని, సీఎంగా వైఎస్ జగన్ మరోసారి బాధ్యతలు చేపడుతారని ఆయన తెలిపారు.

Exit mobile version