Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Mla Guvvala Balraju Headache With Phone Calls

బాలరాజు బాధ ఇంతింతకాదయా!

Published Date :November 6, 2021 , 7:52 pm
By NTV WebDesk
బాలరాజు బాధ ఇంతింతకాదయా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

అవును ఒక్క సవాల్ ఎన్నో కష్టాలు తెచ్చిపెడుతోంది. రాజకీయాల్లోకి వచ్చాక సవాలక్ష సవాళ్ళు, ఆరోపణలు చేస్తుంటాం. అంత మాత్రాన మాట మీద నిలబడమంటే ఎలా. అచ్చం ఇలాంటి బాధలోనే వున్నారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా బాలరాజు చేసిన సవాల్ ఆయన పాలిట శాపంగా మారింది. రాజకీయనేతలు తమ సవాళ్ళు మరిచిపోతారు కానీ ప్రజలు పట్టించుకున్నప్పుడే సమస్య వస్తుంటుంది. ఇప్పుడు అదే సమస్య టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు వచ్చింది. ఆయన అన్న ఓ మాటను ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. సోషల్ మీడియాలో అయితే అదే పనిగా ట్రోల్ చేస్తున్నారు.

హుజురాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా గువ్వల బాలరాజు సవాల్ విసిరారు. ఈటల అక్కడ గెలిస్తే రాజీనామా చేస్తానన్నారు. ఈటల గెలవడంతో ఆయన సవాల్‌ ని కొందరు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. మీరు రాజీనామా ఎప్పుడు చేస్తారంటూ అదే పనిగా ఫోన్ చేసి మరీ అడుగుతుండడంతో తల పట్టుకుంటున్నారు ఎమ్మెల్యే బాలరాజు. ఈ ఫోన్ కాల్స్ దెబ్బకు ఆయనకు బీపీ పెరిగి అప్పుడప్పుడు కొంత మందిని చెడామడా తిట్టేస్తున్నారు. పాపం వాటిని కూడా సోషల్ మీడియాలో పెట్టడంతో బాలరాజు బాధ అంతా ఇంతా కాదు.

ఈటల గెలిస్తే రాజీనామా చేస్తానన్న గువ్వల బాలరాజు మాట నిలబెట్టుకోవాలని సోషల్ మీడియాలో క్యాంపైన్ నడుస్తోంది. గద్వాల నుండి ఓ బీజేపీ కార్యకర్త ఇలాగే ఫోన్ చేసి అడిగే సరికి ఆయన బీపీ పెరిగిపోయింది. ఆయన అనరాని మాటలన్నారు. ఆ ఆడియోను ఆయన ఆన్ లైన్‌లో పోస్ట్ చేశారు. అవన్నీ వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో అనేక మంది సవాళ్లు చేస్తారని అంత మాత్రాన ఇలా వెంట పడటం ఏమిటని బాలరాజు బాధపడుతున్నారు. ఈ బాధ పంచుకునేవారే కరువయ్యారు. ఈ ఫోన్ కాల్స్ దెబ్బతో ఆయన అసలు ఫోన్ తీయడానికి భయపడిపోతున్నారు.

ఇదిలా వుంటే.. ఎమ్మెల్యే గువ్వల బాల రాజుకి కాల్ చేసి అసభ్యంగా మాట్లాడి వాట్సప్ లో వైరల్ చేసిన హుజూరాబాద్ మండలం సింగపూర్ కు చెందిన కుమార్ అనే వ్యక్తి పై కేసు నమోదు చేశారు హుజూరాబాద్ పోలీసులు. సోషల్ మీడియా పై నిఘా పెట్టామని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే క్రిమినల్ కేసులు తప్పవంటున్నారు పోలీసులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Challenge
  • EETALA
  • guvvala balraju
  • headache for mla balraju
  • Huzurabad by-election

తాజావార్తలు

  • LPG Cylinder Booking New Rules: మళ్లీ మారిన సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్.. మరింత కఠినతరం..

  • Ram Pothineni New Movie: రామ్ పోతినేని నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఊహించని డైరెక్టర్?

  • Petrol Bunk Rush: పెట్రోల్, డీజిల్ డీలర్లకు షాకిచ్చిన ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్ కోసం జనం పరుగులు!

  • OnePlus 15T: వన్‌ప్లస్ 15T లాంచ్.. 7500mAh గ్లేసియర్ బ్యాటరీ, 100W ఛార్జింగ్

  • RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions