NTV Telugu Site icon

టోక్యో ఒలింపిక్స్‌.. భారత్‌ బోణీ కొట్టింది..

Mirabai Chanu

Mirabai Chanu

టోక్యో ఒలింపిక్స్‌లో బోణీ కొట్టింది భారత్… ఒలింపిక్స్‌లో తొలి రోజే ప‌త‌కాల వేల ప్రారంభించిన ఇండియా.. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను సిల్వర్ మెడ‌ల్ సాధించారు.. ఇక, ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో కరణ మల్లీశ్వరి పతకం గెలిచిన తర్వాత మీరాబాయి చాను పతకం సాధించారు.. అయితే, ఐదేళ్ల క్రితం జరిగిన రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతుందని అంతా ఆశలు పెట్టుకున్నా.. కేవలం రెండు పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. మరోవైపు.. ఈసారి మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.. అంచనాలకు తగ్గట్టుగానే.. భారత్‌ పతకాల వేట ప్రారంభించింది.