Site icon NTV Telugu

‘మంగళవారం మరదలు’ వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్‌రెడ్డి వివరణ

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఉద్దేశిస్తూ ‘మంగళవారం మరదలు’ అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను ఒక మహిళ గురించి తప్పుగా మాట్లాడలేదని.. ఏకవచనం వాడలేదని క్లారిటీ ఇచ్చారు. తాను మాట్లాడిన భాషలో ఏదైనా తప్పు ఉంటే చింతిస్తున్నానని వెల్లడించారు. షర్మిల తన కుమార్తె కంటే పెద్దది… సోదరి కంటే చిన్నది. తండ్రి సమకాలీకుడైన సీఎం కేసీఆర్‌ను ఏకవచనంతో ఆమె సంభోదించడం సంస్కారమేనా?’ అని నిరంజన్‌రెడ్డి షర్మిలకు చురకలు అంటించారు.

Read Also: పునీత్ మృతికి అసలు కారణం అదేనా..?

మరోవైపు తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు దశల వారీగా మొదలు అవుతున్నాయని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. తాను సవాలు విసిరిన తర్వాత బీజేపీ నేతలు పలాయనం చిత్తగించారని ఎద్దేవా చేశారు. కేంద్రం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రకటించడం విధి అని.. మద్దతు ధరతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే.. అది రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని నిరంజన్‌రెడ్డి అన్నారు. కేంద్రం మద్దతు ధర ప్రకటించి… రాష్ట్రాలు మీ చావు మీరు చావండి అంటుందని నిప్పులు చెరిగారు. కేంద్రాన్ని తమ వడ్లు కొనాలని అడుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందని ఫైరయ్యారు. పంజాబ్ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు కొన్నప్పుడు… తెలంగాణలో ఎందుకు కొనరు అంటూ నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు.

Read Also: ‘మంగళవారం మరదలు’ అన్న మంత్రి నిరంజన్‌రెడ్డి… ఏకిపారేసిన వైఎస్ షర్మిల

Exit mobile version