NTV Telugu Site icon

గోవా టూర్‌లో మంత్రి కేటీఆర్.. ఫ్యామిలీతో షాపింగ్

ఎప్పుడూ అధికారులతో సమావేశాలు, పార్టీ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండే మంత్రి కేటీఆర్ గోవా పర్యటనలో హాయిగా సేద తీరారు. ఈ సందర్భంగా గోవాలో ఆయన రోడ్ సైడ్ షాపింగ్ చేశారు. తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా గోవా టూర్ వెళ్లిన మంత్రి కేటీఆర్ తన ఫ్యామిలీతో కలిసి లోకల్ బజారులో షాపింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా అక్కడ షాపింగ్ చేసిన ఫోటోలతో పాటు చిరు వ్యాపారులతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.