NTV Telugu Site icon

లైఫ్ సైన్సెస్‌కు కేపిటల్ హైదరాబాద్‌:కేటీఆర్‌

దేశంలో ఫార్మారంగానికి కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది హైదరాబాద్‌. సంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పటాన్‌ చెరు నియోజకవర్గ పరిధిలోని సుల్తాన్ పూర్ లో మెడికల్ డివైజ్‌ పార్కులో కంపెనీలను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఇవాళ ఏడు కంపెనీలను ప్రారంభించడంతో కొత్త శకం ప్రారంభం అవుతోంది. అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ లోని మెడికల్ డివైజ్‌ పార్క్ లో 7 కంపెనీ లను ప్రారంభించిన మంత్రి మాట్లాడారు.

265 కోట్ల పెట్టుబడితో 1300 మందికి ఉపాధి కల్పించనున్నాయి ఏడు పరిశ్రమలు. సుల్తాన్ పూర్ మెడికల్ డివైజ్‌ పార్కులో 7 కంపెనీలు వచ్చాయి. ఇప్పటికే 7 కంపెనీలు తమ ఉత్పత్తులు చేస్తున్నాయన్నారు మంత్రి కేటీఆర్. దేశానికి లైఫ్ సైన్సెస్‌కు క్యాపిటల్ సిటీగా హైదరాబాద్ ఉందన్నారు.

అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ లోని మెడికల్ డివైస్ పార్క్ లో 7 కంపెనీలు రావడం సంతోషంగా వుందన్నారు. సుల్తాన్ పూర్ మెడికల్ డివైజ్‌ పార్క్ లో 50 కి పైగా సంస్థలకు స్థలాలు కేటాయించడం జరిగిందన్నారు. ఎంతోమంది నిరుద్యోగులకు ఇక్కడ ఉపాధి లభిస్తోందన్నారు. కరోనా మహమ్మారి టైంలో దేశమంతా హైదరాబాద్‌ వైపు చూసింది. భారత్ బయోటెక్ తయారుచేసిన వ్యాక్సిన్ ఎంతో ప్రాముఖ్యత సాధించింది. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.