NTV Telugu Site icon

చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారు : మంత్రి అనిల్‌

Anil Kumar Yadav

Anil Kumar Yadav

ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాలో వరదలు సంభవించాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో తీవ్ర పంట, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. వర్షాలతో అన్నమయ్య ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరడంతో అన్నమయ్య జలాశయం కొట్టుకుపోయింది. దీంతో అన్నమయ్య ప్రాజెక్ట్‌ కొట్టుకుపోవడం మానవ తప్పిదం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు చేశారు.

చంద్రబాబు మాటలకు కౌంటర్‌గా మంత్రి అనిల్‌ మాట్లాడుతూ.. అన్నమయ్య ప్రాజెక్ట్‌ కెపాసిటీ 2లక్షల 17 వేల క్యూసెక్కులు కాగా గంటల వ్యవధిలోనే 3 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరందన్నారు. ఇలాంటి వరదలు గతల 140 సంవత్సరాలలో ఇదే మొదటి సారి అని.. చంద్రబాబు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్ట్‌ విషయంలో చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని, విపత్తులను కూడా ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తున్నారని ఆయన అన్నారు.