Mi-17 V5 హెలికాఫ్టర్ ప్రత్యేకతలు ఇవే..!

  • ప్రపంచలోని బెస్ట్ ఆర్మ్డ్ హెలికాఫ్టర్లలో Mi-17 V5 ఒకటి.
  • ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యంత అధునాతన హెలికాప్టర్‌లలో ఒకటి..
  • ఈ ఛాపర్ యొక్క భద్రతా రికార్డు ప్రపంచంలోని కొన్ని ఇతర కార్గో ఛాపర్‌ల కంటే ఎంతో మెరుగ్గా ఉంది. ప్రమాదాలు తక్కువగా నమోదవుతూ ఉంటాయి..
  • Mi-17V5 అనేది Mi-8/17 హెలికాప్టర్ల శ్రేణికి చెందినది..
  • మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ కోసం దీన్ని స్పెషల్ గా డిజైన్ చేశారు..
  • ప్రపంచవ్యాప్తంగా అనేక అగ్రదేశాల ఆర్మీలో ఈ రకం హెలికాఫ్టర్‌లను ఉపయోగిస్తున్నారు..
  • రష్యాకు చెందిన కజాన్ హెలికాప్టర్స్ సంస్థ వీటిని తయారు చేస్తుంది..
  • ఈ హెలికాప్టర్‌ను సైన్యం.. ఆయుధాల రవాణా, అగ్నిమాపక మద్దతు, కాన్వాయ్ ఎస్కార్ట్, పెట్రోలింగ్ , సెర్చ్ అండ్ రెస్క్యూ వంటి వాటి కోసం ఉపయోగిస్తారు..
  • ఇండియన్ ఆర్మీలో ఈ హెలికాఫ్టర్లు 80 ఉన్నాయి..
  • Mi-17V5 హెలికాఫ్టర్‌లో క్లిమోవ్ TV3-117VM లేదా VK-2500 టర్బో-షాఫ్ట్ ఇంజన్లు ఉంటాయి..
  • 2,100 నుంచి 2,700 హెచ్‌పీ పవర్ అవుట్‌పుట్‌ను ఈ టర్బో షాఫ్ట్ ఇంజిన్లు ఉత్పత్తి చేస్తాయి..
  • ఈ హెలికాప్టర్ పూర్తి డిజిటల్ కంట్రోల్ సిస్టం తో ఉంటుంది..
  • గంటకు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ఈ హెలికాప్టర్ ప్రయాణిస్తుంది..
  • అత్యధిక ఇంధన సామర్థ్యం ఉన్న ఈ హెలికాప్టర్ లో ఒక్క సారి ఫ్యూయల్ నింపితే ఐదు వందలకుపైగా కిలోమీటర్లు ప్రయాణించవచ్చు..
  • ఈ హెలికాప్టర్ లో రెండు పెట్రోల్ ట్యాంకులు ఉంటాయి…
  • రెండు పెట్రోల్ ట్యాంక్ లోని ఫ్యూయల్ తో వెయ్యి కిలోమీటర్ల వరకూ ఈ హెలికాఫ్టర్‌తో నిరంతరం గా ప్రయాణించవచ్చు..
  • ఈ హెలికాప్టర్ గరిష్టంగా 6,000 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది.
  • Mi-17 రవాణా హెలికాప్టర్ ప్రయాణీకుల కోసం ప్రామాణిక పోర్ట్‌సైడ్ డోర్‌తో కూడిన పెద్ద క్యాబిన్‌ను ఉంటుంది.
  • ఆర్మ్డ్ ఫోర్సెస్, కార్గో ట్రాన్స్పోర్ట్ కోసం హెలికాప్టర్ వెనుకవైపు రాంప్‌ ఉంటుంది.
  • ఈ హెలికాప్టర్ గరిష్టంగా టేకాఫ్ బరువు 13,000 కిలోలు..
  • 36 మంది పట్టె సామర్థ్యం కలిగి 4,500 కిలోల బరువును మోయగలదు..
  • క్లిష్ట పరిస్థితులలో కూడా సమర్థంగా పని చేస్తుంది..
  • యుద్ధ సమయంలో శత్రుదుర్బేద్యంగా పని చేస్తుంది..
  • Mi-17V5 నాలుగు మల్టీఫంక్షన్ డిస్‌ప్లేలు , నైట్-విజన్ వేపన్స్, ఆన్-బోర్డ్ వెదర్ రాడార్ ఆటోపైలట్ సిస్టమ్‌తో సహా అత్యాధునిక ఏవియానిక్స్‌తో కూడిన గ్లాస్ కాక్‌పిట్‌ లతో కూడిన వ్యవస్థ ఉండటం ఈ హెలికాఫ్టర్ ప్రత్యేకత..
  • ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం Mi-17 V5 హెలికాప్టర్లను.. నావిగేషన్,ఇన్ఫర్మేషన్-డిస్ప్లేస్, క్యూయింగ్ సిస్టమ్‌లతో వీటిని రూపొందించారు..
  • దీన్ని యుద్ద సమయంలో వేపన్స్, ఫోర్సెస్ ను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు..
  • Shturm-V మిసైల్స్, S-8 రాకెట్లు, 23mm మెషిన్ గన్, PKT మెషిన్ గన్‌లు, AKM సబ్-మెషిన్ గన్‌లను ఈ హెలికాప్టర్‌తో తో లోడ్ చేయవచ్చు.. టార్గెట్ ని ఫినిష్ చెయ్యవచ్చు..