బ్రిటన్ ఆటోమోబైల్ దిగ్గజం ఎంజీ కంపెనీ ఆస్టర్ మోడల్‌ను అక్టోబర్ 11 వ తేదీన ఇండియాలో రిలీజ్ చేసింది. అక్టోబర్ 21 వ తేదీన ఎంజీ అస్టర్ మిడిల్ సైజ్ ఎస్‌యూవీకి సంబంధించి ప్రీబుకింగ్‌ను ప్రారంభించింది. ప్రీ బుకింగ్‌ను ప్రారంభించిన 20 నిమిషాల వ్యవధిలోనే 5 వేల కార్ల బుకింగ్ జరిగినట్టు ఎంజీ ఇండియా ప్రకటించింది. ఇప్పుడు బుక్ చేసుకున్న 5 వేల కార్లను వచ్చే ఏడాదివినియోగదారులకు అందజేస్తారు. కొత్త కార్ల బుకింగ్ కోసం వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే అని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఎంజీ ఆస్టర్ మిడిల్ సైజ్ ఎస్‌యూవీ ధర ఇండియాలో రూ.7.8 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు ఉన్నది. కరోనా తరువాత ఈ స్థాయిలో కార్ల బుకింగ్ జరగడం విశేషం.
ఎంజీ అస్టర్ రికార్డ్: 20 నిమిషాల్లో 5 వేల కార్లు బుకింగ్…
