కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా నుంచి బయటపడేందుకు అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే అనేక రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొచ్చి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. అయినప్పటికీ కరోనా అంతం కాలేదు. కొత్తగా రూపం మార్చుకొని విజృంభిస్తూనే ఉన్నది. కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు హెపరిన్ అనే ముక్కుద్వారా తీసుకునే ఔషదాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ హెపరిన్‌ను రక్తాన్ని పలుచగా మార్చేందుకు మెడిసిన్‌గా వినియోగిస్తారు. హెపరిన్ చౌకగా దొరికే ఔషదం. దీనిని ముక్కులో చుక్కల వేస్తే కరోనా వైరస్ ఏమైనా ఉంటే అంతం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Read: ఒమిక్రాన్ వ్యాప్తిపై ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం…
కరోనా తొలిదశలో వినియోగించేందుకు అనుగుణంగా ఈ హెపరిన్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై సమగ్రమైన పరిశోధనలు చేస్తున్నారు. 2022 మిడిల్ వరకు ఈ మెడిసిన్ అందుబాటులోకి రావొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలో చేస్తున్న ప్రయోగాలు కొంతమేర విజయవంతం అయ్యాయని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ప్రయోగాలు పూర్తయితేగాని దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.
