Site icon NTV Telugu

షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన మెహరీన్‌.. నిశ్చితార్థం రద్దు

టాలీవుడ్‌ నటి మెహరీన్‌ పిర్జాదా ఇటీవల హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటిస్తుందనుకుంటే షాకింగ్‌ న్యూస్‌ ను చెప్పింది. తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు ట్విటర్‌ వేదికగా మెహరీన్‌ స్వయంగా లేఖ ద్వారా వెల్లడించింది. ఇక నుంచి భవ్య బిష్ణోయ్‌, అతని కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధం ఉండబోదని మెహరీన్‌ స్పష్టం చేసింది. ఇరువురు ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపింది. నా వ్యక్తిగత విషయాన్నీ అందరు గౌరవిస్తారని అనుకుంటున్నాను.. ప్రస్తుతం కమిట్ అయినా సినిమాలను పూర్తిచేయడంపై ఫోకస్ చేస్తున్నాను. ఇకపై సినిమాలపైనే పూర్తి దృష్టిపెట్టనున్నట్లు ఆమె తెలిపింది. కాగా, మెహరీన్‌ ఈ నిర్ణయం తీసుకోవడంపై అంత షాక్ కు గురవుతున్నారు.

Exit mobile version