ఒలింపిక్ పతాక విజేత పీవీ సింధుకు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఘనంగా సన్మానం జరిగింది. ఈ వేడుకకు అక్కినేని నాగార్జునతో పాటు రాధిక, సుహాసిని సహా మెగా కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై సింధును సన్మానించారు. ఈమేరకు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వీడియో షేర్ చేశారు. పీవీ సింధు ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, రెండు ఒలింపిక్స్ పతకాలతో సింధు అద్భుత ఘనత సాధించిందని కొనియాడారు. సింధును ఆత్మీయుల మధ్య గౌరవించడం ఎంతో ఆనందాన్నిస్తోందని చిరు పేర్కొన్నారు.
A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)