భారీవర్షాలు ఏపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతి అల్లాడిపోతోంది. ఏ ప్రాంతం చూసినా నీటిలోనే వుంది. కాలనీలు మూడు నాలుగు అడుగుల నీటిలోనే వుండిపోయాయి. దీంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. లక్ష్మీపురం వరద నీటిలో కొట్టుమిట్టాడుతోంది. తిరుపతిలో నిండు కుండలా మారింది రాయల్ చెరువు. ముంపునకు గురయ్యాయి. కాలేపల్లి, సూరాళ్లపల్లి, రాయల్ చెరువు పేట,చిట్టతూరు చెరువులు. ప్రధానంా రాయల్ చెరువు నిండుగా వుండడంతో నాలుగు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇన్ ఫ్లో కంటే అవుట్ ప్లో తక్కువగా వుండడంతో ఆందోళనకు గురైతున్నారు బలిజపల్లి,సంజయరాయ పురం,పివి పురం,గంగిరెడ్డి పల్లి ప్రజలు. చెరువుకు గండి పడితే శ్రీకాళహస్తి వరకు నీటి ప్రవాహం వుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. చెరువుకు ఎలాంటి గండి పడదని భరోసా ఇస్తున్నారు అధికారులు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీగా వున్నారు అధికారులు. వాహనాలు బయటకు తీయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.