NTV Telugu Site icon

మ‌నోహ‌ర‌మైన ఈ టీ ఖ‌రీదు ల‌క్ష మాత్ర‌మే…

ఉద‌యం లేచిన‌ప్ప‌టి నుంచి తిరిగి నిద్ర‌పోయే వ‌ర‌కు మ‌న‌జీవితంలో ఒక్కక్క‌టి ఒక్కోవిధంగా భాగ‌మై ఉంటుంది.  కొంత‌మంది ఉద‌యం లేచిన వెంట‌నే టీ లేదా కాఫీ తాగే అల‌వాటు ఉంటుంది.  చాలా మంది లేచిన వెంట‌నే టీ తాగుతుంటారు.  టీ అంటే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది అస్సాం.  అస్సాంలో టీ తోట‌లు అధికం. అక్క‌డ నాణ్య‌మైన తేయాకును పండిస్తుంటారు.  అస్సాంలో దొరికిన్ని వెరైటీలు మ‌రెక్క‌డా దొర‌క‌వు.  కిలో తేయాకు రూ. 100 నుంచి వేల రూపాయ‌ల వ‌ర‌కు ఉంటుంది.  ఖ‌రీదైన టీల‌లో మ‌నోహ‌రి బ్రాండ్ టీ కూడా ఒక‌టి.  ఈ టీ ఖ‌రీదు వేల‌ల్లో ఉంటుంది.  ఇటీవ‌లే ఈ బ్రాండ్ తేయాకును వేలం వేశారు.  వేలంలో కిలో తేయాకును రూ. 99,999 కి కొనుగోలు చేశారు.  కిలో తేయాకు ఈ స్థాయిలో వేలంలో అమ్ముడ‌వ‌డం ఇదే మొద‌టిసారి అని చెప్ప‌వ‌చ్చు.  

Read: ఆదానీ చేతికి ఓజోన్ రియ‌ల్ గ్రూప్‌…?