పారాలింపిక్స్ 2020 లో భారత అథ్లెట్లు తమ జోరును కొనసాగిస్తున్నారు. తాజాగా మిక్సిడ్
50 మీ పిస్టల్ షూటింగ్ లో భారత షూటర్లు మనీష్, సింగ్‌రాజ్ రెండు పతకాలు సాధించారు. ఈ విభాగంలో మొత్తం 218.2 పాయింట్లతో కొత్త పారాలింపిక్ రికార్డు సృష్టించి షూటర్ మనీష్ స్వర్ణం గెలిచాడు. అలాగే మరో షూటర్ సింగ్‌రాజ్ 216.7 పాయింట్లతో రజత పతకాన్ని అందుకున్నాడు. అయితే ఇప్పటికే పారాలింపిక్స్ 2020 లో 2 స్వర్ణ పతకాలు, 6 రజతం, 5 కాంస్యలతో మొత్తం 13 పతకాలు సాధించి 37 స్థానంలో ఉన్న ఇండియా ఈ రెండు పతకాలను కలుపుకొని మొత్తం 15 పతకాలతో 34 వ స్థానానికి చేరుకుంది. అలాగే మరో ఇద్దరు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఫైనల్స్ కు చేరుకొని రెండు పతకాలను ఖాయం చేసారు.
పారాలింపిక్స్ : భారత్ ఖాతాలో మరో గోల్డ్, సిల్వర్
