‘మా’ భవనంపై మరో వారంలో ప్రకటిస్తా – మంచు విష్ణు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘మా’ సభ్యులకు ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు మాట్లాడుతూ – ”మెడికవర్ హాస్పటల్స్, మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత చికిత్స ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 914 మంది సభ్యులకు వివిధ రకాల మాస్టర్ హెల్త్ చెకప్ లు చేస్తున్నారు. మా అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేసిన దగ్గర్నుంచి మాదాల రవి అన్నదగ్గర ఉండి అన్నీ చూసుకున్నారు. మెడికవర్ హాస్పటల్ వారు ముందుకు వచ్చి ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తున్నారు. అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండో వారంలో ఈ హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేస్తాము. మెడికవర్ వాళ్ళు ఫిల్మ్ జర్నలిస్ట్ లకు కూడా ఉచితంగా హెల్త్ చెకప్ లు చేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాను” అని అన్నారు.
వారం రోజుల్లో ప్రకటన…
మా బిల్డింగ్ కోసం చర్చలు జరుగుతున్నాయి. ‘మా’ కమిటీ మీటింగ్ జరిగింది. వారం రోజుల్లో మా బిల్డింగ్ పై ప్రకటన చేస్తాం.
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
రాజీనామాలు ఆమోదం…
ప్రకాష్ రాజ్ ప్యానల్ లో పోటీ చేసి, గెలుపొందిన 11మంది సభ్యులు రాజీనామా చేసారు. రాజీనామాలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరాను. కానీ వారు అందుకు సిద్ధంగా లేకపోవడంతో నెల రోజుల పాటు వెయిట్ చేసి, రాజీనామాలను అంగీకరించడం జరిగింది. మా అసోసియేషన్ వర్క్స్ కోసం వారి స్థానంలో కొత్త సభ్యులను తీసుకున్నాను. అయితే వారు ‘మా’ సభ్యులుగా కొనసాగుతారు. నాగబాబు, ప్రకాష్ రాజు కూడా ‘మా’ సభ్యులుగా కొనసాగుతారు.
డాక్టర్ అనిల్ (మెడికవర్ హాస్పటల్)
రొటీన్ గా చేసే హెల్త్ చెకప్ ఇవి. ఈ హెల్త్ చెకప్ లు మా సభ్యులకు చేయటం చాలా సంతోషంగా ఉంది. అన్ని రకాల వ్యాధులకు టెస్టులు చేస్తున్నాము.
రఘుబాబు – ‘మా’ జనరల్ సెక్రటరీ
హెల్త్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. దానిని ఫస్ట్ ప్రయార్టీగా తీసుకుని, సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు ‘మా’ ప్రెసిడెంట్ విష్ణు. ముందుముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు విష్ణు ఆధ్వర్యంలో సక్సెస్ ఫుల్ గా జరుగుతాయి.
శివబాలాజీ – ‘మా’ ట్రెజరర్
హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ. మా సభ్యులు అందరూ దీనిని ఉపయోగించుకోవాలి. ‘మా’ సభ్యుల హెల్త్ కోసం తీసుకున్న ఈ నిర్ణయంలో ‘మా’ ప్రెసిడెంట్ విష్ణు సక్సెస్ అయ్యారు.
మాదాల రవి – ‘మా’ వైస్ ప్రెసిడెంట్
మా సభ్యుల ఆరోగ్యం ముఖ్యం. సామాజిక స్పృహతో పనిచేస్తున్న మెడికవర్ హాస్పటల్ కి కృతజ్ఞతలు. చాలా హాస్పటల్స్ తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఉచితంగా మాస్టర్ హెల్త్ చెకప్ చేయడానికి మెడికవర్ హాస్పటల్ ముందుకు వచ్చింది. అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలి.
తాజావార్తలు
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!