కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోంది. ఎప్పుడు ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో అని ప్రజలు భయపడిపోతున్నారు. యూరప్ దేశాల్లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. అలానే, ఆఫ్రికా దేశాల్లో ఒమిక్రాన్ కేసులు అధికమవుతున్నాయి. ఆసియా దేశాల్లోనూ ఇంచుమించు ఇదేవిధమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటు వస్తున్న న్యూజిలాండ్ దేశంలోనూ కరోనా భయం పట్టుకుంది. కేసులు పెరుగుతున్నాయి. దీంతో వ్యాక్సినేషన్‌ను వేగం చేశారు.
Read: ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధి ఇదే…
కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. అయితే, ఓ వ్యక్తి కరోనాకు భయపడి ఏకంగా 10 వ్యాక్సిన్లు తీసుకున్నాడట. అదీ కూడా 24 గంటల వ్యవధిలోనే. వివిధ వ్యక్తులకు సంబంధించిన గుర్తింపు కార్డ్‌లతో ఇలా వ్యాక్సిన్ తీసుకున్నాడు. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యి అతని ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ప్రభుత్వానికి వెల్లడించారు. 10 వ్యాక్సిన్లు తీసుకున్న సదరు వ్యక్తిని ఆసుపత్రికి తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎవరి వ్యాక్సిన్ వారే తీసుకోవాలని, గుర్తింపుకార్డులు మరోకరికి ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది.
