NTV Telugu Site icon

Yogi Death Threat: ప్రియురాలి తండ్రి ఫోన్‌తో కుట్ర.. యోగిని చంపేస్తానన్న వ్యక్తి అరెస్ట్

Yogi

Yogi

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానంటూ బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు 19 ఏళ్ల అమీన్‌గా గుర్తించారు. తన స్నేహితురాలి తండ్రికి చెందిన నంబర్ నుండి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ‘హత్యచేస్తానంటూ బెదిరింపు ఫోన్ చేశారు. పోలీసుల ఎమర్జెన్సీ నంబర్ 112కు కాల్ చేయడం ద్వారా యోగి ఆదిత్యనాథ్‌కు అమీన్ చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు చేప్టటారు.
Also Read:Andhra Pradesh: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో యూజర్ ఛార్జీల పెంపు.. వెంటనే అమల్లోకి..

బేగంపూర్వలో నిందితుడిని అరెస్టు చేశామని, కాల్ చేయడానికి ఉపయోగించిన మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నామని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) అంకితా శర్మ తెలిపారు. అమీన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు తన నేరాన్ని అంగీకరించాడని చెప్పారు. విచారణ సందర్భంగా నిందితుడు అసలు విషయం చెప్పాడు. తన ప్రేమ వ్యవహరం పట్ల ప్రియురాలి తండ్రి అభ్యతరం చెప్పాడు. దీంతో అమీన్ ఈ కుట్ర పన్నాడని పోలీసులు తెలిపారు. 10 రోజుల క్రితం తన ప్రియురాలి తండ్రి మొబైల్‌ ఫోన్‌ను దొంగిలించానని, తన సిమ్‌ కార్డును ఉపయోగించి బెదిరింపు కాల్‌ చేశానని అంగీకరించినట్లు ఆమె తెలిపారు. అమీన్‌పై మూడు క్రిమినల్ కేసులు నమోదు చేశామని, బుధవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read:Ambedkar Secretariat : కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్‌ కొలువుదీరనున్నది అప్పుడే..

సుమారు 10 రోజుల క్రితం తన మొబైల్ ఫోన్ దొంగిలించబడిందని పేర్కొన్న ఈ-రిక్షా డ్రైవర్ అయిన యువతి తండ్రిని పోలీసులకు తెలిపారని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (బాబుపూర్వ) సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. అమీన్ తన కూతురిని పెళ్లి చేసుకోవాలనుకున్నందున ఆ వ్యక్తిని ట్రాప్ చేయడానికి కుట్ర పన్నాడని పోలీసులు చెప్పారు.

Show comments