Site icon NTV Telugu

అంకుల్ అని పిలిచిన యువతి.. కోపంతో ఆ వ్యక్తి చేసిన పనికి…

ఉత్తరాఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉదమ్ సింగ్ నగర్‌లోని సితార్‌ గంజ్‌లో 18 ఏళ్ల యువతి తనను అంకుల్ అని పిలిచిందని 35 ఏళ్ల వ్యక్తి దాడి చేశాడు. ఖాటిమా రోడ్డులో ఉన్న ఓ స్పోర్ట్స్ దుకాణంలో 18 ఏళ్ల యువతి రాకెట్ కొనుగోలు చేసింది. అయితే ఆ రాకెట్‌కు డ్యామేజీ ఉండటంతో దానిని మార్చుకునేందుకు మళ్లీ ఆ దుకాణానికి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ పనిచేసే 35 ఏళ్ల మోహిత్ కుమార్‌ను అంకుల్ అని పిలిచింది.

Read Also: 2021 రివైండ్….. విశేషాలు – వివాదాలు

అయితే తనను అంకుల్ అని పిలవడంతో కోపంతో ఊగిపోయిన మోహిత్… ఆ యువతి ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. కోపంతో ఆ వ్యక్తి చేసిన పనికి యువతికి తీవ్రగాయాలు అయ్యాయి. ముఖం వెంట రక్తం ధారలు ధారలుగా కారిపోయింది. దీంతో కంగారుపడ్డ షాప్ యజమాని వెంటనే యువతిని ఆస్పత్రికి తరలించాడు. వైద్యులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో మోహిత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version