Site icon NTV Telugu

ఆమెకు అసలు బోన్స్ ఉన్నాయా ? హీరోయిన్ పై మహేష్ కామెంట్స్

Mahesh Babu praises Love Story Team

సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా “లవ్ స్టోరీ” టీంపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా సాయి పల్లవిపై. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం “లవ్ స్టోరీ”. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకుంటున్న ఈ సినిమాపై మహేష్ బాబు వరుస ట్వీట్లతో ప్రశంసల వర్షం కురిపించారు.

Read Also : ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ : ఏ ఒక్కరిని వదలక ఏకిపారేసిన పవన్

“శేఖర్ కమ్ముల దర్శకత్వం బాగుంది. నాగ చైతన్యలోని నటుడిని బయటకు తీసుకొచ్చిన చిత్రం ‘లవ్ స్టోరీ’. ఆయనకు ఇది గేమ్ చేంజర్. మంచి పర్ఫార్మెన్స్… సంగీత దర్శకుడు పవన్ సిహెచ్ సెన్సషనల్ మ్యూజిక్ అందించారు. వాట్ ఏ మ్యూజిక్… ఏఆర్ రెహమాన్ గారు ఆయన మీ శిష్యుడని విన్నాను. మరు ఖచ్చితంగా ఆయన గురించి గర్వపడతారు. ఈ టెస్టింగ్ సమయంలో ‘లవ్ స్టోరీ’ నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరమైన బ్లాక్ బస్టర్ మూవీని ఇచ్చారు” అంటూ చిత్రబృందం ప్రతి ఒక్కరినీ మహేష్ పేరు పేరునా అభినందించారు. ఇక సాయి పల్లవిని మాత్రం ఇంకా స్పెషల్ గా ప్రశంసించారు. “సాయి పల్లవి ఎప్పటిలాగే సెన్సేషనల్… ఈ అమ్మాయికి అసలు బోన్స్ ఉన్నాయా ?! ఇప్పటి వరకూ సిల్వర్ స్క్రీన్ పై ఎవరూ ఇలా డ్యాన్స్ చేయడం చూడలేదు. ఆమె కలలా కదులుతుంది” అంటూ సాయి పల్లవిని పొగడ్తలతో ముంచెత్తారు.

Exit mobile version