దేశంలో కరెన్సీ నోట్లపై జాతిపిత గాంధీజీ బొమ్మ కనిపిస్తుంది. బోసి నవ్వులు నవ్వుతూ ఉండే ఆ బొమ్మ లేకుంటే ఆ నోటు చెల్లదు. దేశంలో స్వాతంత్య్రం రాకముందు నుంచే కరెన్సీ నోట్లు అందుబాటులో ఉన్నాయి. స్వాతంత్య్రం రాక ముందు ఉన్న కరెన్సీ నోట్లపై కింగ్ జార్జ్ బొమ్మ ఉండేది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1949తో ఇండియా రూపాయి నోటును అందుబాటులోకి తీసుకొచ్చింది. రూపాయినోటుపై కింగ్ జార్జ్ బొమ్మకు బదులుగా మహాత్మా గాంధీ బొమ్మను ఉంచాలని ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిపై అప్పట్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ ప్లేస్‌లో అశోకస్తంభం బొమ్మను ముద్రించారు. ఆ తరువాత అనేక నోట్లను ఆర్బీఐ ముద్రించింది.
Read: ప్రపంచం కనుగొన్న తొలి వ్యాక్సిన్ ఇదే… ప్రచారం చేసింది ఎవరో తెలుసా?
1969లో మహాత్మా గాంధీ శతజయంతి సందర్భంగా తొలిసారి కరెన్సీ నోటుపై మహాత్మాగాంధీ బొమ్మను ముద్రించారు. అయితే, 1987 లో తొలిసారి ఇండియా రూ.500 నోటును తీసుకొచ్చింది. దానిపై మహాత్మగాంధీ బొమ్మను ముద్రించారు. 1996 నుంచి ముద్రించిన ప్రతి కరెన్సీ నోటుపై మహాత్మాగాంధీ బొమ్మను ముద్రిస్తున్నారు. అయితే, కరెన్సీనోట్లపై ముద్రించే మహాత్మగాంధీ ఫొటోను మయన్మార్‌లో తీశారు. 1946 లో మహాత్మాగాంధీ మయన్నార్ వెళ్లిన సమయంలో ఈ ఫొటోను తీశారు. ఆ ఫొటోనే ప్రస్తుతం కరెన్సీ నోట్లపై ముద్రిస్తున్నారు.
