మహారాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి అనీల్ దేశ్‌ముఖ్‌ను మనీలాండరింగ్ కేసులోఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ముంబై కార్యాలయంలో 12 గంటలపాటు సుధీర్ఘంగా అనీల్ దేశ్‌ముఖ్‌ను అధికారులు ప్రశ్నించారు. ముంబైలో బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని సస్పెండ్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజే ను ఆదేశించినట్టు ముంబై మాజీ పోలీసు అధికారి పరంబీర్ సింగ్ ఆరోపణలు చేశారు. దీంలో ఎన్‌పోర్స్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి అనీల్ దేశ్‌ముఖ్‌కు నోటీసులు జారీ చేసింది.
Read: బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి…కాసేపట్లో లెక్కింపు ప్రారంభం
కాగా, ఆయన ఈ కేసు నుంచి బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ లాభం లేకపోయింది. బాంబే హైకోర్టు ఆయను బెయిన్‌ను నిరాకరించింది. కాగా, నిన్నటి రోజున సుదీర్ఘంగా విచారించిన తరువాత అనీల్ దేశ్‌ముఖ్‌ను అరెస్ట్ చేసింది ఈడీ. అటు బాంబే హైకోర్టు అనీల్ దేశ్‌ముఖ్‌పై విచారణ చేపట్టాలని సీబీఐని ఆదేశించింది. ఇందులో భాగంగా సీబీఐ ఇప్పటికే ఓ వ్యక్తిని అరెస్ట్ చేసింది. అయితే, తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని మాజీ హోంశాఖ మంత్రి చెబుతున్నారు.
