Site icon NTV Telugu

అది అవాస్తవం అంటున్న మా ఎన్నికల అధికారి…

మా ఎన్నికలు చాలా నిజాయితీగా నిర్వహించాం అని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. సీసీ ఫుటేజ్ కావాలని అడిగారు.. కానీ నిబంధనల ప్రకారమే ఇస్తాం. సీసీ ఫుటేజ్ చాలా మంది అడిగారు. ఇవ్వడం మొదలు పెడితే ఎంతమందికి ఇవ్వాలి అని ఆయన అన్నారు. ఇక ఎన్నికల పోలింగ్ ఫలితాల పై లిఖితపూర్వక ఫిర్యాదులు మాకు అందలేదు అని చెప్పిన ప్రకాష్ రాజ్, మంచి విష్ణు ఆమోదంతోనే తర్వాత రోజు ఎన్నికల ఫలితాలు ప్రకటించామని తెలిపారు. ఇక తాను బ్యాలెట్ పత్రాలు ఇంటికి తీసుకెళ్లానని ఆరోపిస్తున్నారు.. అది అవాస్తవం అని చెప్పారు. డమ్మీ బ్యాలెట్ పేపర్లను కూడా పోలింగ్ బూత్ లోనే భద్రపరిచాం అని పేర్కొన్నారు. ఇక అక్కడ పని చేస్తున్న కౌంటింగ్ సిబ్బంది అలసిపోయినందుకే ఆదివారం రాత్రి కౌంటింగ్ నిలిపాము అని అన్నారు. ఇక పబ్లిసిటీ పిచ్చితోనే నా పై రోజుకో ఆరోపణ చేస్తున్నారు అన్న ఎన్నికల అధికారి ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల ప్రవర్తన సరిగ్గా లేదు అని అన్నారు.

Exit mobile version