Site icon NTV Telugu

బెంగ‌ళూరులో మ‌ళ్లీ అదే భ‌యం… ఆందోళ‌న‌లో ప్ర‌జ‌లు…

క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో మ‌ళ్లీ వింత శ‌బ్దాలు భ‌య‌పెడుతున్నాయి.  గ‌తంలో కూడా ఇలాంటి వింత శ‌బ్దాలు రావ‌డంతో హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ క్లారిటీ ఇచ్చింది.  యుద్ధ విమానాన్ని ప‌రీక్షిస్తున్న‌ప్పుడు వ‌చ్చిన శ‌బ్దంగా చెప్పింది.  గ‌తేడాది మేలో వ‌చ్చిన శ‌బ్దాల‌కు క్లారిటీ ఇచ్చిన హెచ్ఏఎల్, అదే ఏడాది జూన్‌లో వ‌చ్చిన శ‌బ్దాల‌కు క్లారిటీ ఇవ్వ‌లేదు.  ఆ శబ్దాల‌కు ప్ర‌త్యేక కార‌ణాలు ఏవీ లేవ‌ని చెప్పింది.  

Read: న‌వంబ‌ర్ 27, శ‌నివారం దిన‌ఫ‌లాలు…

కాగా, ఇప్పుడు మ‌రోసారి బెంగ‌ళూరు ప్ర‌జ‌ల‌ను ఈ వింత శ‌బ్దాలు భ‌య‌పెడుతున్నాయి.  రాజ‌ధాని బెంగ‌ళూరుతో పాటుగా మండ్య‌, ర‌మ‌ణ‌న‌గ‌ర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున శ‌బ్దాలు వినిపించాయి.  ఈ శ‌బ్దాల‌కు ఇళ్ల కిటికీలు ఊగిపోయిన‌ట్టు ప్ర‌జ‌లు చెబుతున్నారు.  ఇది భూకంపం కాద‌ని రాష్ట్ర ప్ర‌కృతి విప‌త్తుల ప‌ర్య‌వేక్ష‌ణ కేంద్రం స్ప‌ష్టం చేసింది.  అయితే, ఈ వింత శ‌బ్దాల‌కు కార‌ణం ఏంటో తెలియ‌క ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు లోన‌వుతున్నారు.  

Exit mobile version