NTV Telugu Site icon

Yuvagalam: లోకేష్ పాదయాత్రకు బ్రేక్.. ఎందుకంటే?

Lokesh

Lokesh

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్రకు బ్రేక్ పడింది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో లోకేష్ పాదయాత్రకు విరామం ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా యువగళం పాదయాత్రకు బ్రేక్‌ పడింది. దీంతో పాదయాత్రకు లోకేష్ బ్రేక్‌ ఇచ్చి హైదరాబాద్‌కు బయల్దేరారు. రేపు ఏపీలో గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అన్నమయ్య జిల్లాలో తన పాదయాత్ర కొనసాగుతున్న తరుణంలో.. తాను కంటేవారిపల్లి విడిది కేంద్రంలో ఉండేందుకు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని లోకేష్ కోరారు.
Also Read:Somu Veerraju: కీలక నేతలు బీజేపీలోకి.. పవన్‌-కిరణ్‌ కాంబినేషన్‌పై అధిష్టానానిదే నిర్ణయం..!

రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు ముందుగానే నిర్ణయించుకున్నందున స్థానికంగా ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని లోకేష్ విజ్ఞప్తి చేశారు. అయితే, ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రస్తుతం నియోజకవర్గాన్ని వీడాలని అధికారులు లోకేష్‌కు స్పష్టం చేశారు. దీంతో నారా లోకేష్‌ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి కంటేవారిపల్లి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు.
Also Read:Kunamneni Sambasiva Rao : బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి

ఏపీలో సోమవారం( మార్చి 13) ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 5 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు జరగనుంది. 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Show comments