Site icon NTV Telugu

LIVE: బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్​కు కరీంనగర్​ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సంజయ్‌ సహా కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్‌, పుప్పాల రఘు, కాచు రవి, మర్రి సతీశ్‌కు ఈనెల 17 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జాగరణ దీక్ష సందర్భంగా జరిగిన ఉద్రిక్తత ఘటనలపై పోలీసులు రెండు ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశారు. రెండో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా సంజయ్‌కు కోర్టు రిమాండ్ విధించింది. రేపు మరోసారి బెయిల్ పిటిషన్ వేయనున్నారు బండి సంజయ్ తరపున లాయర్లు. సెషన్స్ కోర్టు జడ్జి సెలవులో ఉన్నందున ఎక్సైజ్ కోర్ట్ కు తరలించడంతో తన పరిధిలోకి రాదంటూ కేసును తిరస్కరించిన న్యాయమూర్తి. బండి సంజయ్ ను కరీంనగర్ జైలుకు తరలించిన పోలీసులు.

Exit mobile version