తెలంగాణలో ఒక్క అక్టోబర్ నెలలో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. అక్టోబర్ నెలలో ఏకంగా రూ.2,653.07 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలియజేసింది. 2020 అక్టోబర్ నెలతో పోలిస్తే సుమారు రూ.30 కోట్లు అధికంగా మద్యం అమ్మకాలు జరగ్గా, 2019 అక్టోబర్ తో పోలిస్తే ఏకంగా వెయ్యికోట్లు అమ్మకాలు పెరిగాయి. సాధారణంగా పండుగలు, సెలవులు అధికంగా ఉన్న సమయాల్లో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతుంటాయి.
Read: దీపావళి ని మన దేశంలో ఎన్ని రకాలుగా జరుపుకుంటారో తెలుసా…!!
అక్టోబర్ నెలలో దసరా పండుగ కారణంగా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. అంతేకాదు, అటు కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నిక ప్రభావం కూడా మద్యం అమ్మకాలపై పడింది. కరీంనగర్ జిల్లా ఎక్సైజ్ పరిధిలో గతేడాది అక్టోబర్ కంటే రూ.4 కోట్ల మద్యం అమ్మకాలు అధికంగా జరిగాయని ఎక్సైజ్ శాఖ తెలియజేసింది.
