యావత్ ప్రపంచంలోని భారతీయులు దీపావళిని అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటారు. కరోనా కారణంగా గతేడాది పెద్దగా ఈ పండుగను నిర్వహించుకోలేకపోయారు. కరోనా నుంచి క్రమంగా బయటపడుతుండటంతో దీపావళి వేడుకను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీపావళి రోజున పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తారు. చెడుపై మంచి విజయానికి గుర్తుగా ఈ వేడుకను నిర్వహిస్తారు. అన్ని ప్రాంతాల్లో టపాసులు కాలిస్తే, ఆ ఒక్క ప్రాంతంలో మాత్రం టపాసులకు బదులుగా కర్రలతో కొట్టుకొని రణరంగం సృష్టిస్తారు. దీనికి కారణం లేకపోలేదు.
Read: రూ.12 తో అక్కడ ఇంటిని సొంతం చేసుకోవచ్చు… ఎలాగంటే…
దీపావళిరోజున కర్రలతో కొట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం అని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లోని జలౌన్ గ్రామంలో ప్రజలు ప్రతీ ఏడాది దీపావళిని లాత్‌మార్ దివాళిగా జరుపుకుంటారట. గ్రామంలోని యువకులంతా ఒక చోటకు చేరుకుంటారు. అనంతరం రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలతో కొట్టుకుంటారు. ఈ సమరంలో తలకు దెబ్బలు తగిలినా పెద్దగా పట్టించుకోరు. లాత్‌మార్ దివాళి కార్యక్రమం అనాదిగా వస్తోందని, ఈ ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నామని జలౌన్ ప్రాంత ప్రజలు చెబుతున్నారు.