అంబేద్కర్ ఆలోచనల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ప్రగతి భవన్ లో నివాళులు అర్పించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… స్వతంత్రం వచ్చిన తొలి నాళ్లలోనే అద్భుతమైన దీర్ఘదృష్టితో భారతదేశ భావి భవిష్యత్తు అవసరమైన భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు ఎల్లప్పుడూ అత్యంత ఆదర్శనీయం అన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల ఫలితంగానే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినదని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఉద్యమ పోరాటంలోనే కాకుండా ప్రభుత్వ పాలనలోనూ అంబేద్కర్ ఆలోచనలే తమకు ప్రాతిపదిక అని కేటీఆర్ తెలిపారు. ఆయన స్ఫూర్తితో సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముందుకు వెళ్తున్నమన్నారు.
