Site icon NTV Telugu

Dhruvanarayan: గుండెపోటుతో కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత

Dhruvanarayan

Dhruvanarayan

కర్ణాటక కాంగ్రెస్‌లో విషాదం నెలకొంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ ఆర్ ద్రువ‌నారాయ‌ణ గుండెపోటుతో క‌న్నుమూశారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. ఇవాళ ఉద‌యం 6.40 నిమిషాల‌కు ఆయ‌న గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను కారులో ఆసుప్రత్రికి త‌ర‌లించారు. అయితే ద్రువ‌నారాయ‌ణ ప్రాణాలు విడిచిన‌ట్లు వైద్యులు చెప్పారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్ నేతలు నివాళి అర్పించారు.

Also Read:Minister Ktr: నేడు, రేపు హస్తినలోనే కేటీఆర్‌.. ఢిల్లీలో న్యాయ నిపుణులతో భేటీ

గ‌తంలో ద్రువ‌నారాయ‌ణ రెండుసార్లు లోక్‌స‌భ ఎంపీగా చేశారు. క‌ర్నాట‌క‌లోని చామ‌రాజ‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించారు. ద్రువ‌నారాయ‌ణ మృతి పట్ల మాజీ సీఎం సిద్ధరామయ్య, కెపిసిసి అధ్యక్షుడు డి.కె. శివకుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 2004 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సంతేమరహళ్లి (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక్క ఓటుతో గెలుపొందారు. ఆయనకు 40,752 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి జెడి(ఎస్) అభ్యర్థి ఎఆర్ కృష్ణమూర్తికి కేవలం ఒక ఓటు తక్కువ వచ్చింది. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నంజన్‌గూడు (ఎస్సీ) రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు.

Also Read:Mlc Kavitha: బై బై మోదీ.. కవితకు మద్దతుగా ఫ్లెక్సీలు..

కాగా, గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. చిన్నవయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పతున్నారు. గతంలో పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా గుండెపోటుతో కన్నుమూశారు. చిత్తూరులో నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు తారకరత్న సైతం గుండెపోటుతోనే మృతి చెందారు. కరోనా వచ్చిన తర్వాతే గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు.

Exit mobile version