Site icon NTV Telugu

10వ రోజు : కోటి దీపోత్సవంలో.. కోనేటి రాయుడి కల్యాణం..

koti-deepotsavam-10th-day-e

కార్తికమాసాన ఎంతో ప్రతిష్టాత్మకంగా భక్తిటీవీ నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. నవంబర్‌ 12వ తేదీన ప్రారంభమైన ఈ వేడుకలు 22న ముగియనున్నాయి. నేడు 10వ రోజును పురస్కరించుకొని విశేషాలను చూద్దాం.. విశాఖపట్నం శారదా పీఠం శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి వార్లచే అనుగ్రహ భాషణం. బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మచే ప్రవచనామృతం.

అనంతరం ఏడుకొండల్లో కొలువుదీరిన కోనేటి రాయుడు తిరుమల శ్రీనివాస కల్యాణోత్సవం నేత్రపర్వంగా జరుగనుంది. ఆ తరువాత భక్తులను ఆశీర్వదించేందుకు స్వామి వార్ల పల్లకి సేవ కోటి దీపోత్సవ వేదిక ప్రాంగంణం చుట్టూ ఊరేగించనున్నారు. ఇక కోటి దీపోత్సవ వేడుకకే తలమానికమైన భక్తకోటిచే దీపార్చన. అనిర్వచనీయమైన స్వర్ణలింగోద్భవ ఘట్టం చూసి తరించాల్సిందే.. స్వామి వారికి నివేందించే నంది, నాగ, నక్షత్ర, సింహా, కుంభ, బిల్వ, రుద్ర హారతులు దర్శించి పునీతులవ్వడమే గానీ మరేం చెప్పలేం.

వైభవోపేతంగా నిర్వహిస్తోన్న వేడుకలకు రండి.. తరలి రండి.. ఈ రోజు సాయంత్రం ఎన్టీఆర్‌ స్టేడియంలో.. వివిధ ప్రాంతాల నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా కలదు. 9వ రోజు కోటి దీపోత్సవ వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు క్రింది వీక్షించండి.

https://www.youtube.com/watch?v=yQqrgwnQdO4
https://www.youtube.com/watch?v=FSVu2XbIa1s
Exit mobile version