NTV Telugu Site icon

ప్రపంచంలో అత్యంత ఎత్తైన గ్రామంలో వ్యాక్సినేషన్ పూర్తి…

ప్రపంచంలో అత్యంత ఎత్తైన గ్రామం ఎక్కడుంది అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉందని చెప్తారు.  హిమాచల్ ప్రదేశ్ లోని కోమిక్ గ్రామం అత్యంత ఎత్తైన గ్రామంగా చెప్తారు.  కరోనా మహమ్మారి నుంచి రక్షణ కోసం దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు.  చాలా ప్రాంతాల్లో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు.  కొన్ని చోట్ల ఒక డోస్ వ్యాక్సిన్ వేయించుకుంటే, మరికొన్ని చోట్ల  మొదటి డోస్ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు.  అయితే, కోమిక్ గ్రామంలో 45 ఏళ్ళు నిండిన అందరికి రెండు విడతల వ్యాక్సిన్ ను అందించారు.  వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ ప్రాంతంలోని ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆసక్తి చూపడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తయిందని వైద్యాధికారులు పేర్కొన్నారు.