NTV Telugu Site icon

ఐపీఎల్ 2021 : టాస్ గెలిచిన కేకేఆర్

యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ బౌలింగ్ తీసుకొని చెన్నై జట్టును మొదట బ్యాటింగ్ కు పంపిస్తున్నాడు. ఇక ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో 24 సార్లు తలపడగా చెన్నై జట్టే 16 మ్యాచ్లలో విజయం సాధించి కేకేఆర్ పై ఆధిపత్యం కొనసాగిస్తోంది. అయితే ఈరోజు జరుగుతున్న ఫైనల్స్ లో ఎవరు విజయం సాధిస్తారో అనేది చూడాలి.

గెలిచే టీం ను అంచనా వేయండి 50 లక్షలు గెలవండి – FUN88.com

చెన్నై : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మోయిన్ అలీ, అంబటి రాయుడు, ధోని (C/WK), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

కోల్ కతా : గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (WK), ఇయన్ మోర్గాన్ (C), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి