Site icon NTV Telugu

లోక్‌సభ ముందుకు ఓటరు కార్డు-ఆధార్‌ లింక్‌ బిల్లు.. విపక్షాల రియాక్షన్‌ ఇది..

ఓటర్‌ జాబితా నుంచి బోగస్‌ ఓటర్లను ఏరివేయడమే లక్ష్యం అంటూ ఓటరు కార్డు-ఆధార్‌ కార్డు అనుసంధానికి సిద్ధం అవుతోంది కేంద్ర ప్రభుత్వం.. దీనికి ఇప్పటికే కేంద్ర కేబినెట్‌ ఆమోదం లభించగా.. ఇక, ఇవాళ లోక్‌స‌భ‌లో ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లు 2021ను ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు… పౌరుల ఎలక్టోరల్ కార్డులతో ఆధార్ నంబర్‌ను లింక్ చేయాలని బిల్లు కోరగా, దానిని ప్రవేశపెట్టడాన్ని మాత్రం ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. బిల్లు శాసన సామర్థ్యాలకు మించినదని కాంగ్రెస్‌ నేత మనీష్‌ తివారీ అంటే, పౌరుల గోప్యతను ఉల్లంఘిస్తున్నారని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు.. మరోవైపు.. సోమవారం పార్లమెంట్‌ ఉభసభలు ప్రారంభం అయిన వెంటనే సస్పెండ్ చేయబడిన ఎంపీలు, ఇతర సమస్యలపై ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనలను కొనసాగించడంతో.. లాంటి బిజినెస్‌ లేకుండానే రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. లోక్‌సభ రెండుసార్లు వాయిదా పడింది.. మధ్యాహ్నం 2 గంటలకు ఉభయ సభలు తిరిగి ప్రారంభంకానున్నాయి.

Read Also: అక్కడ ఉదయం 5 గంటల నుంచే మెట్రో రైలు సేవలు..

అయితే, లోక్‌సభలో మంత్రి కిరణ్‌ రిజిజు ప్రవేశపెట్టిన బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు.. బోగ‌స్ ఓటింగ్‌, న‌కిలీ ఓటింగ్‌ను నిర్మూలించాలంటే ఈ బిల్లుకు ఆమోదం త‌ప్పద‌ని రిజిజు స్పష్టం చేశారు.. కానీ, ఆధార్ చ‌ట్టం ప్రకారం ఆధార్‌ను ఓట‌ర్ కార్డుతో అనుసంధానం చేయ‌రాదు అని కాంగ్రెస్ నేత మ‌నీష్ తివారీ తెలిపారు.. ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లును వెన‌క్కి తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.. మరోవైపు.. హైదరాబాద్‌ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్‌ ఎంపీ శ‌శిథ‌రూర్ కూడా ఈ బిల్లును తప్పుబట్టారు.. ఆధార్‌ కార్డును కేవ‌లం అడ్రస్ ప్రూఫ్‌గా వాడార‌ని, కానీ, అది పౌర‌స‌త్వ ధృవీక‌ర‌ణ ప‌త్రం కాదన్నారు శ‌శిథ‌రూర్.. ఓట‌ర్లను ఆధార్ అడిగితే, అప్పుడు కేవ‌లం అడ్రస్ డాక్యుమెంట్ మాత్రమే వ‌స్తుంద‌ని, అంటే పౌరులు కాని వారికి మీరు ఓటు వేసే హ‌క్కు క‌ల్పిస్తున్నట్లు అవుతుందని ఆరోపించారు శ‌శిథ‌రూర్.. ఇక, ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లును స్టాండింగ్ క‌మిటీకి సిఫార‌సు చేయాల‌ని డిమాండ్‌ చేశారు కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రి.

Read Also: అక్కడ ఉదయం 5 గంటల నుంచే మెట్రో రైలు సేవలు..

Exit mobile version