ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచానికి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. నాలుగు నెలల క్రితం లావుగా కనిపించిన కిమ్ నాలుగు నెలల తరువాత స్లిమ్‌గా మారిపోయాడు. రోజు రోజుకు ఆయన బరువు తగ్గుతుండటంతో కొరియన్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉండాలంటే ఫిట్ గా ఉండాలని నిపుణులు హెచ్చరించడంతో కిమ్ తన ఆరోగ్యంపైనా, బరువు తగ్గడంపైనా దృష్టిసారించారని అంటున్నారు. అయితే, సామన్యప్రజలు మాత్రం కిమ్ కు ఏదో ఆయిందని, ఇలా తమ నేతను చూడటం కష్టంగా మారిందని చెబుతున్నారు. కిమ్ అప్పుడు ఇప్పుడు అనే కథనంతో అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోసారి సోషల్ మీడియాలో హల్చల్…బాబోయ్ అంటున్న కొరియన్లు…
