హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతులు మంజూరు చేయడంతో ట్యాంక్ బండ్ వద్ద వినాయకుల నిమజ్జనానికి ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర రేపు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కాబోతున్నది. దీనికి సంబందించిన ఏర్పాట్లును నిర్వహకులు వేగంగా చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టు పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఈ రోజు రాత్రి 9 గంటల తరువాత ఖైరతాబాద్ గణపతి దర్శనానికి అనుమతిని రద్దు చేశారు. రేపు తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం 6 గంటలకు గణపతి విగ్రహాన్ని ట్రాలీపైకి ఎక్కించనున్నారు. 6గంటల నుంచి 8 గంటల వరకు వెల్డింగ్ వర్క్ జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. కరోనా కారణంగా శోభాయాత్రను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి గణపతిని నిమజ్జనం చేయాలని నిర్వహాకులు నిర్ణయం తీసుకున్నారు.
Read: ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : రాహుల్ గాంధీ వచ్చి ఉంటే బాగుండేదా..?