NTV Telugu Site icon

ప్రగతి భవన్ చేరుకున్న కేసీఆర్‌.. ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చ..

తెలంగాణలో ఎమ్మెల్యే, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ తమ ఎమ్మెల్యే అభ్యర్థులపై కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ప్రగతి భవన్‌కు సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేరుకోనున్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై చర్చించి ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయం ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఆరు, గవర్నర్ కోటా లో ఒకటి ఖాళీ ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కు ఎల్లుండి ఆఖరు రోజు.