తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షత విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ హజరయ్యారు. అయితే ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు జనాల్లో ఉండాలని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా మీరు జనాల్లో ఉండకపోతే ఎవరు ఏమి చేయలేరని ఎమ్మెల్యేలకు చురకలు అంటించారు.
రైతు వేదికల్లో రైతులతో సమావేశాలు పెట్టండని, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయటం లేదన్న విషయాన్ని రైతులకు చెప్పండని వివరించారు. కేంద్రం చేతులెత్తేసింది కాబట్టి మనం ధాన్యం కొనటం లేదని రైతులోకి తీసుకెళ్లండని, వరి కి ప్రత్యామ్నాయ పంటలు రైతులకు వివరించాలని ఎమ్మెల్యేలకు తెలిపారు. అయితే ఇంకా సమావేశం జరుగుతోంది.
