NTV Telugu Site icon

Karnataka polls: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో యశ్‌.. కేజీఎఫ్ హీరో కోసం ఆఫర్లు

Yash

Yash

కర్ణాటక ఎన్నికల్లో స్టార్ వార్ కొనసాగుతోంది. ఓవైపు పార్టీ నాయకులు ప్రచారం చేస్తుంటే.. దానికి సినీ గ్లామర్ ని కూడా టచ్ చేశారు. ఇప్పటికే కన్నడ స్టార్ హీరో సుదీప్ అధికార బీజేపీ తరుపున ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇతర నటులపై కూడా ఫోకస్ పెట్టాయి. కన్నడ స్టార్ హీరో యశ్‌ని కూడా ప్రచార రంగంలోకి దింపాలని పలు ప్రార్టీలు యోచిస్తున్నాయి. మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల ప్రచారాన్ని చేపట్టేందుకు పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల ఆఫర్లను యష్ తిరస్కరించినట్లు ఆయనకు సన్నిహిత వర్గాల సమాచారం.
Also Read: Taapsee: సిక్స్ ప్యాక్ తో షాక్ ఇచ్చిన తాప్సీ…

కన్నడ ఇండస్ట్రీలో యష్ స్టార్ హీరో. కేజీఎఫ్ సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో బిజెపి, కాంగ్రెస్, జెడి(ఎస్) ఆయనను స్టార్ క్యాంపెయినర్‌గా యష్ ని తీసుకెళ్లాలని నిరంతరం సంప్రదిస్తున్నారు. అయితే, యష్ తన భవిష్యత్ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించాడు. రాజకీయ నాయకుల అన్ని ఆఫర్‌లను తిరస్కరించాడు.
Also Read:Kiran Kumar Reddy Joins Bjp Live: బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి

గత అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థుల కోసం యష్ ప్రచారం చేశారు. కన్నడ సూపర్‌స్టార్ దర్శన్‌తో కలిసి మాండ్యాలో చివరి రోజు వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడిపై స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీష్ విజయం సాధించారు. ప్రస్తుతం యష్ కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ నెలాఖరులోగా ఆయన తాజా సినిమాల ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు యశ్‌తో సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కాంతారావు ఫేమ్ రిషబ్ శెట్టి కూడా ఏ రాజకీయ పార్టీకి ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్నాడు.