Site icon NTV Telugu

చైనా మ‌రో కుట్ర‌… ఇండియా న‌దుల‌ను…

ఇండియాలోని అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌పై చైనా ఎప్ప‌టి నుంచో క‌న్నేసింది.  ఎలాగైనా ఆ రాష్ట్రాన్ని త‌న దేశంలో క‌లిపేసుకొవాల‌ని చూస్తున్న‌ది. ల‌ద్దాఖ్ లో కిరికిరి చేస్తూనే, చైనా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ బోర్డ‌ర్‌లో బ‌ల‌గాల‌ను మొహ‌రిస్తూ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది.  అయితే, చైనా ఇప్ప‌డు కొత్త ఎత్తులు వేస్తున్న‌ది.  చైనా నుంచి ఇండియాలోని అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోకి ప్ర‌వేశంచే నదుల‌ను క‌లుషితం చేస్తున్న‌ది. దీని వ‌ల‌న న‌దులు న‌ల్ల‌గా మారిపోతున్నాయి.  అందులో నివ‌శించే చేప‌లు, ఇత‌ర జీవుల‌కు ఆక్సీజ‌న్ అంద‌క వేల సంఖ్య‌లో మ‌ర‌ణిస్తున్నాయి.  

Read: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి..పెరగనున్న వైసీపీ బలం

చైనా బోర్డ‌ర్‌లో పెద్ద ఎత్తున క‌ట్ట‌డాల‌ను నిర్మిస్తున్న‌ది.  ఈ క‌ట్ట‌డాల వ్య‌ర్థాల‌ను న‌దిలో కామెంగ్ న‌దిలో క‌లిపేస్తున్న‌ది.  ఫ‌లితంగా న‌దిలోని నీరు మొత్తం న‌ల్ల‌గా మారిపోయింది.  సాధార‌ణంగా లీట‌ర్ నీటిలో క‌రిగే వ్య‌ర్థాల ప‌రిమాణం 300 మిల్లీ గ్రాముల నుంచి 1200 మిల్లీ గ్రాముల వ‌ర‌కు ఉండ‌వ‌చ్చు.  కానీ, కామెంగ్ న‌దిలో క‌రిగే వ్య‌ర్థాలు 6800 మిల్లీ గ్రాముల వ‌ర‌కు ఉంటోంది.  దీంతో న‌ది మొత్తం న‌ల్ల‌గా మారిపోయి దేనికి ప‌నికి రాకుండా పోతున్న‌ది. ఎగువ ప్రాంతంలో చైనా క‌ట్ట‌డాలు నిర్మిస్తు వాటి వ్యర్థాల‌ను పెద్ద సంఖ్య‌లో కామెంగ్ న‌దిలో క‌లిపేస్తున్నద‌ని అదికారులు చెబుతున్నారు.  

Read: తాలిబ‌న్ ప్ర‌భుత్వాన్ని ఎందుకు గుర్తించ‌డంలేదు…?

Exit mobile version