నిజామాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఏక గ్రీవం అయింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ గా తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె… కల్వకుంట్ల కవిత ఏక గ్రీవం గా ఎన్నిక అయ్యారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలో లేకపోవడంతో… టీఆర్‌ఎస్ పార్టీ ఏక గ్రీవంగా విజయం సాధించింది. అయితే.. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ వేసిన నామినేషన్ ను తిరస్కరించారు ఎన్నికల అధికారులు.
ఇక ఇవాళ సాయంత్రం లోగా.. కల్వకుంట్ల కవిత గెలుపును అధికారికంగా ప్రకటన చేయనున్నారు అధికారులు. కల్వకుంట్ల కవిత గెలుపుతో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. అటు రంగారెడ్డి జిల్లా రెండు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అయ్యాయి. ఎమ్మెల్సీ లుగా షంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.