గత కొన్ని రోజుల క్రితం ఇంట్లో కాలు జారిపడి సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ సికింద్రాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . అయితే తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 1959లో సిపాయి కూతరు సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆయన మొన్న వచ్చిన అరుంధతి సినిమా వరకు వివిధ పాత్రల్లో నటించిన ప్రేక్షకులను మెప్పించారు.
ఆయన నటనకు ‘నవరసనటనా సార్వభౌమ’ ‘కళా ప్రపూర్ణ’ ‘నటశేఖర’ లాంటి బిరుదులు వరించాయి. ఆయన ఇప్పటివరకు సుమారు 777 సినిమాల్లో నటించారు. అంతేకాకుండా 28 పౌరాణిక, 51 జానపద, 9 చారిత్రక చిత్రాల్లో అభినయించారు. సుమారు 200 మంది దర్శకులతో పని చేశారు.
ఆయన నటించిన సినిమాల్లో ఓ 10 సినిమాలు సుమారు ఒక సంవత్సరం పాటు నిర్విరామంగా ప్రదర్శింపబడ్డాయి. తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో తన దైన శైలిలో ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాకుండా ఆయన దివంగత నటుడు ఎన్టీఆర్ కు డూప్‌గా కూడా నటించడం విశేషం.