తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పై జస్టిస్ చంద్రు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేకంగా మాట్లాడితే.. ఎవరూ ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేరని కేసీఆర్ ను హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ తీరు విస్మయం కలిగించిందని వెల్లడించారు. సమ్మె ఎన్ని రోజులు చేస్తారో చూస్తానని కేసీఆర్.. కార్మికులను బెదిరించారని ఆగ్రహించారు.
యూనియన్లతో కాకుండా ఉద్యోగులతోనే మాట్లాడతాననడం ఏంటి అని నిలదీశారు. కచ్చితంగా యూనియన్లతోనే మాట్లాడాలని పేర్కొన్నారు. జలహక్కులకు వ్యతిరేకంగా వెళ్తే.. కేసీఆర్ ఎన్నో రోజులు అధికారంలో ఉండలేరని పేర్కొన్నారు. జై భీమ్ సినిమా ఒక కొత్త గుర్తింపు కార్డు తీసుకొచ్చిందని.. ఈ సినిమా తర్వాత దేశ వ్యాప్తంగా ఆహ్వానాలు వస్తున్నాయని జస్టిస్ చంద్రు తెలిపారు.
