Site icon NTV Telugu

Jr. Ntr: ఫ్యాన్సా.. మజాకా.. ఎన్టీఆర్‌కు హారతి ఇచ్చిన సునిశిత్..

Whatsapp Image 2023 05 29 At 3.57.24 Pm

Whatsapp Image 2023 05 29 At 3.57.24 Pm

సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించడానికి కొందరు ఎన్నెన్నో జిమ్మిక్కులు చేస్తారు.. కొంతమంది సినీ స్టార్స్ ను టార్గెట్ చేస్తూ నోటికి వచ్చినట్లు కామెంట్స్ చేస్తూ ఫ్యాన్స్ తో చివాట్లు తినడమే కాదు.. తన్నులు కూడా తింటున్నారు.. అలాంటి ఘటన ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది.. సాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్‌ పేరు ఈ మధ్య బాగా పాపులర్ అయ్యింది.. రామ్ చరణ్, ఉపాసనల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి తన్నులు తిన్నాడు..

ఓ యూట్యూబ్ ఛానెల్‌లో తప్పుగా మాట్లాడటంతో సునిశిత్‌ను చరణ్ ఫ్యాన్స్ చితకబాదారు. ఇంకెప్పుడూ రామ్ చరణ్, ఉపాసన‌తో పాటు సినిమా పరిశ్రమలో ఏ ఒక్కరిపైనా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు.. ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.. ఆ వీడియో వైరల్ కావడంతో నందమూరి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చితకాబాదారు..

అయితే, మొత్తానికి సునిశిత్‌ను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పట్టేశారు. అప్పటికే భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్న సునిశిత్‌ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమీ చేయలేదట.. కాకపోతే కాస్త వెరైటీగా అతనికి బుద్ది చెప్పినట్లు తెలుస్తుంది.. ఎన్టీఆర్ ఫోటోను తీసుకొచ్చి అతనితో హారతి ఇప్పించారు..ఆ వీడియోను ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది..

Exit mobile version