Site icon NTV Telugu

ఝార్ఖండ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం… లీటర్ పెట్రోల్‌పై రూ. 25 త‌గ్గింపు…

దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు భారీగా పెరిగిన సంగ‌తి తెలిసిందే.  పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు వంద దాటిపోవ‌డంతో వాహ‌న దారులు ఇబ్బందులు ప‌డుతున్నారు.  కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్ర‌భుత్వం పెట్రోల్ ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది.  పెట్రోల్ పై రూ. 5, డిజిల్ పై రూ. త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది.  కేంద్రం త‌గ్గించ‌ని ధ‌ర‌ల‌కు అనుగుణంగా అనేక రాష్ట్రాలు కూడా పెట్రోల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించాయి.  ఇక ఇదిలా ఉంటే, ఝార్ఖండ్ ప్ర‌భుత్వం వాహ‌న‌దారుల‌కు మ‌రో గుడ్‌న్యూస్‌ను చెప్పింది.  

Read: యూకేలో 1.30 ల‌క్ష‌ల కేసులు… కిట‌కిట‌లాడుతున్న ఆసుప‌త్రులు…

పెట్రోల్ ధ‌ర‌ల‌ను భారీగా త‌గ్గిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.  లీట‌ర్ పెట్రోల్‌పై రూ. 25 త‌గ్గిస్తున్న‌ట్టు సీఎం ప్ర‌క‌టించారు.  త‌గ్గించిన ధ‌ర‌లు జ‌న‌వ‌రి 26 నుంచి అమ‌లులోకి వ‌స్తాయ‌ని ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్ ప్ర‌క‌టించారు.  సీఎం హేమంత్ సోరెన్ తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని అక్క‌డి ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తున్నారు.  మ‌రి ఝార్ఖండ్ బాట‌లో మిగ‌తా రాష్ట్రాలు కూడా పెట్రోల్ ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తాయా చూడాలి.  క‌రోనా మ‌హ‌మ్మారి త‌రువాత ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు పెట్రోల్ ధ‌ర‌ల‌పై ప‌న్నులు పెంచారు. అంతేకాదు, ఒపెక్ ప్లస్ దేశాలు ముడి చ‌మురు ఉత్ప‌త్తిని భారీగా త‌గ్గిస్తూ గ‌తంలో నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ధ‌ర‌లు పెరిగిపోయాయి.

Exit mobile version