ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా రాజకీయాల్లో చాలా కాలం నుంచి పరిటాల కుటుంబం, జేసీ కుటుంబం బద్ధ శత్రువులుగా ఉన్నాయి. గతంలో జేసీ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉండగా… పరిటాల కుటుంబం మాత్రం తెలుగుదేశం పార్టీతో అనుబంధం కొనసాగిస్తూ వస్తోంది. అయితే 2014 తర్వాత జేసీ కుటుంబం కూడా టీడీపీలో చేరడంతో ఈ రెండు వర్గాల మధ్య క్రమంగా దూరం తగ్గుతూ వస్తోందని టాక్ నడిచింది.
Read Also: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
అయితే తాజాగా నారా లోకేష్ పర్యటన సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ ఇద్దరూ కలుసుకుని ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అనంతరం నవ్వుతూ పలకరించుకోవడం అక్కడ అందర్నీ ఆశ్చర్యానికి, ఒకింత సంతోషానికి గురి చేసింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి, శ్రీరామ్ నవ్వుతూ పలకరించుకుంటున్న వీడియో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని.. అన్నం తింటుండగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈ సమస్య టీడీపీది కాదని.. రాష్ట్ర ప్రజలది అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని.. ఇప్పటికైనా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయకపోతే ఏమీ మిగలదని వాపోయారు.