Site icon NTV Telugu

రాజ్య‌స‌భ‌లో ఐశ్య‌ర్య‌రాయ్ ప్ర‌స్తావ‌న‌.. జ‌యాబ‌చ్చ‌న్‌ సీరియ‌స్‌

పనామా పేపర్స్ లీక్ కేసులో ఐశ్వర్యారాయ్ ఈడీ విచారణ అంశాన్ని కొందరు సభ్యులు ప్రస్తావించడంపై…ఆమె అత్త, ఎంపీ జయాబచ్చన్ రాజ్యసభలో మండిపడ్డారు. తమ కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించి…కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా కామెంట్లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

https://ntvtelugu.com/rishabh-pant-appointed-uttarakhand-brand-ambassador-cm-dhami-tweeted/


రాజ్యసభ ఛైర్మన్‌ ఛైర్‌ ఉద్దేశించి…మీ నుంచి మేము న్యాయం కావాలంటున్నామని…అధికార పార్టీ సభ్యుల నుంచి కాదన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని జయాబచ్చన్‌ హెచ్చరించారు. సభలో ఏం జరుగుతోందంటూ ప్రశ్నించిన ఆమె…అధికార పార్టీ సభ్యులను కంట్రోల్‌లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. జయాబచ్చన్‌ వ్యాఖ్యలతో గందరగోళం రేగడంతో…సభను రేపటికి వాయిదా వేశారు.

Exit mobile version